Saturday, May 4, 2024

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అసోసియేట్ స్పాన్సర్ గా హైయర్ ఇండియా

హైదరాబాద్ : గృహోపకరణాల్లో గ్లోబల్ లీడర్, 14 సంవత్సరాలుగా మేజర్ అప్లయెన్సెస్‌లో ప్రపంచంలోనే నంబర్ 1 బ్రాండ్ అయిన హైయర్ అప్లయెన్సెస్ ఇండియా (హైయర్ ఇండియా), ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించింది. విభిన్నమైన, ఆసక్తికరమైన పోటీదారుల కలయికతో, భావోద్వేగాలు, వినోదంతో నిండిన రోలర్‌కోస్టర్ రైడ్‌గా నిలిచే బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, స్టార్ మాలో ప్రసారం చేయబడుతుంది.

ఈ భాగస్వామ్యం గురించి హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ ఎస్ మాట్లాడుతూ… ఈ ప్రాంతంలో అత్యధికంగా వీక్షించబడే టెలివిజన్ షోలలో ఒకటైన బిగ్ బాస్ 7 తెలుగుతో మళ్లీ అనుబంధం కలిగి ఉన్నందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. వినూత్నమైన, విశ్వసనీయమైన, సాంకేతికతతో నడిచే గృహోపకరణాలను అందించడం ద్వారా భారతీయ వినియోగదారుల రోజువారీ జీవితంలో భాగం కావడానికి హైయర్ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. వినియోగదారులతో కనెక్ట్ అవ్వడానికి తమకు గొప్ప అవకాశాన్ని బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అందిస్తుందన్నారు. భారతదేశం అత్యంత ప్రియమైన టెలివిజన్ షోలలో ఒకదాని ద్వారా తమ ప్రేక్షకులకు చేరుకోవటానికి ఈ సినర్జిస్టిక్ సహకారం గురించి తాము నిజంగా గర్విస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement