Wednesday, May 1, 2024

Breaking: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్న వాన

హైదరబాద్​లో ఇవ్వాల (బుధవారం) సాయంత్రం నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. సాయంత్రం 5 గంటల దాకా కూల్​ కూల్​గా ఉన్న వెదర్ ఆ తర్వాత మారిపోయింది. ఆకాశంలో నల్లని కారుమేఘాలు కమ్ముకున్నాయి.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, పెద్ద అంబర్​పేట్​ హయత్​నగర్​, వనస్థలిపురం, ఎల్బీనగర్​ మన్సూరాబాద్​, దిల్​సుఖ్​నగర్​, చైతన్యపురి, కొత్తపేట వంటి పలు ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement