Thursday, April 25, 2024

మైడెన్‌ ఫార్మా దగ్గు మందు ఉత్పత్తి నిలిపివేత

మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ దగ్గు సిరప్‌ల ఉత్పత్తిని నిలిపివేయాలని #హర్యానా ప్రభుత్వం ఆదేశించింది.
ఈ సంస్థ ఉత్పత్తి చేసిన సిరప్‌ కారణంగా గాంబియాలో 66 మంది చిన్నారులు మరమణించారు. ఈ క్రమంలో
కేంద్ర, రాష్ట్ర డ్రగ్స్‌ డిపార్ట్‌మెంట్‌లు సంయుక్తంగా తనిఖీలు జరిపాయి. సిరప్‌లో 12 లోపాలు ఉన్నట్లు గుర్తించాయి. ఇందులో వెల్లడైన లోపాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం ఉత్పత్తినే నిలిపివేయాలని నిర్ణయించి, ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు హర్యానా హోం మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు.

సోనిపట్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీకి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న మూడు డ్రగ్స్‌ నమూనాలను కోల్‌కతాలోని సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబ్‌కు పంపామని, నివేదికలు అందాల్సి ఉందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ #హర్యానాలో తయారైన నాలుగు దగ్గు సిరప్‌ ఉత్పత్తులపై హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో తీవ్రమైన కిడ్నీ గాయాల కారణంగా 66 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇందులో డై ఇథనీల్‌ ్లగకాల్‌, ఇథలీన్‌గకాల్‌ మందు మోతాదుకు మించి ఉందని, ఇది పూర్తిగా విషపూరితమని మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుందని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement