Thursday, May 2, 2024

ఏపీలో 1 లీటర్ పెట్ బాటిల్‌ను రూ. 137 వద్ద విడుదల చేసిన గోల్డ్ డ్రాప్

గోల్డ్ డ్రాప్ ఏపీలో 1 లీటర్ పెట్ బాటిల్ ను రూ.137ల వద్ద విడుదల చేసింది. ఈసందర్భంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ… “ ఎల్లప్పుడూ వినియోగదారుల అవసరాలను గుర్తెరిగి వాటిని తీర్చడాన్ని గోల్డ్ డ్రాప్ విశ్వసిస్తుంది. ఆ నమ్మకానికి కొనసాగింపు 1 లీటర్ పెట్ బాటిల్. అన్ని భద్రతా చర్యలనూ పరిగణలోకి తీసుకుని వినియోగదారుల కోసం తీర్చిదిద్దిన ఒక సౌకర్యవంతమైన ప్యాక్ ఇది ” అని అన్నారు.

గోల్డ్ డ్రాప్‌లో వినియోగదారుల భద్రత అత్యంత ప్రధానమైనదన్నారు. ఈ పెట్ బాటిల్స్‌లో ట్యాంపర్ ప్రూఫ్ సీల్స్ , ఇతర అంశాలు ఉన్నాయన్నారు. ఇవి ప్రపంచ స్థాయి, స్వచ్ఛమైన నూనెను వినియోగదారులు వినియోగిస్తున్నారని నిర్ధారిస్తాయన్నారు. ప్యాకింగ్, స్టోరేజీలు వినియోగదారుల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ పరిశుభ్రతా ప్రమాణాలను కలిగి ఉన్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement