Monday, April 29, 2024

రైతులకు లాభాలను పెంచడంలో సహాయపడుతున్న గోద్రెజ్ అగ్రోవెట్ పీవైఎన్ఏ

హైద‌రాబాద్ : గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్, క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ కంపెనీ పీవైఎన్ఏ బ్రాండ్ ఉత్పత్తులు పత్తి రైతులకు ఎకరాకు అయ్యే సాగు ఖర్చును గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొంది. ఈసంద‌ర్భంగా జీఏవీఎల్, క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్, సీఈఓ రాజవేలు ఎన్ కె మాట్లాడుతూ… జీఏవీఎల్ వద్ద తాము పర్యావరణ అనుకూల పత్తి ఉత్పత్తి పద్ధతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయ ఉత్పాదకత, లాభదాయకతను మెరుగు పరచడానికి కట్టుబడి ఉన్నామన్నారు. త‌మ పీవైఎన్ఏ బ్రాండ్ ఉత్పత్తులు పత్తి రైతులకు గణనీయంగా ఖర్చును తగ్గిస్తున్నాయన్నారు. తద్వారా వారి ఆర్థిక విజయానికి సహకరించడం తాము గౌరవంగా భావిస్తున్నామన్నారు.

భారతీయ రైతుల జీవనోపాధిని పెంచడమే త‌మ అంతిమ లక్ష్యం కాబట్టి, పీవైఎన్ఏ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో కింద కొత్త సాంకేతికతలను పరిచయం చేయడానికి, కొత్త మిశ్రమాలు, సూత్రీకరణలను ఆవిష్కరించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. పీవైఎన్ఏ బ్రాండ్ విజయానికి 15 సహ-బ్రాండెడ్ కంపెనీలు, బహుళజాతి సంస్థలు, భారతీయ కంపెనీలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యం కారణమని చెప్పవచ్చన్నారు. పీవైఎన్ఏ బ్రాండింగ్ నాణ్యత నియంత్రణను నిర్ధారిస్తుందన్నారు. గోద్రెజ్, దాని సహ-మార్కెటర్ల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తూ రైతుల మధ్య నమ్మకాన్ని కలిగిస్తుందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement