Saturday, June 22, 2024

NZB: ఘనంగా కేటీఆర్ బర్త్ డే.. లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

నిజామాబాద్ రూరల్, జులై 24 ప్రభ న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం నిజామాబాద్ రూరల్ మండలంలో గల గాంధీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఐ డి సి ఎం ఎస్ ఉమ్మడి జిల్లాల చైర్మన్ సాంబారి మోహన్, మండల ఎంపీపీ అనుష ప్రేమ్ నాయక్, జడ్పిటిసి సుమలత గోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో లింగేశ్వర ఆశ్రమం కృష్ణ మహారాజ్ చేతుల మీదుగా శివునికి ప్రత్యేక పూజ చేయించి పాలాభిషేకం చేయడం చేశారు.

ఈ సందర్భంగా చైర్మెన్ సాంబార్ మోహన్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని మండలాల్లోని ఆలయాల్లో ఘనంగా జరుపుకుంటారని, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, మండల పార్టీ అధ్యక్షులు మీసాల మధుకర్ రావు, కేసీఆర్ సేవాదళం రూరల్ కన్వీనర్ దేవేందర్, నుడా డైరెక్టర్ సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ జితేందర్, మండల సర్పంచ్ పోరం అధ్యక్షులు అశోక్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోత్ గోపాల్ నాయక్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మనుబోతుల మల్లేష్ పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాయడి బాలరాజ్ కేశపూర్ విజయ్ వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు స్వామి, వివిధ గ్రామాల సర్పంచులు అనూష, నగేష్, రాంగోపాల్ రెడ్డి సుభాష్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్, సురేందర్, జలంధర్, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు మారయ్య, ఉప సర్పంచ్ గురువయ్య, సీనియర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement