Monday, May 6, 2024

జీహెచ్ ఎంసీ హై అల‌ర్ట్: హైదరాబాద్‌లో కుంభవృష్టి.. మూడు రోజులుగా ఎడ‌తెరిపి లేని వాన‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారీ వర్షాలతో రాజధాని హైదరాబాద్‌ నగరంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), జలమండలి డీఆర్‌ఎఫ్‌ అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. గ్రేటర్‌లో వర్షం నీరు నిలిచే 211 ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు అధికారులు. వర్షం నీటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి(ఎస్‌ఎన్‌డీపీ) పనులు జరుగుతున్న ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించి భద్రతా చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు సంబంధించి హెల్ప్‌లైన్‌ నెం. 04021111111ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది.

నగరవాసులు మ్యాన్‌ హోల్స్‌ తెరవద్దని జలమండలి హెచ్చరించింది. మ్యాన్‌హోల్స్‌ మూతలు విరిగినా తెరచి ఉన్నా సమాచారం ఇవ్వాలని హైదరాబాద్‌ వాటర్‌ బోర్డ్‌ సూచించింది. భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ హై అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాన శుక్రవారం ఉదయం నుంచి గ్రేటర్‌ వ్యాప్తంగా విస్తరించింది. శనివారం కూడా వర్షం భారీగా కురిసింది. ముంపు ప్రాంతాల్లో నగర మేయర్‌ విజయలక్ష్మీ పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేట ప్రధాన రహదారిపై రసూల్‌ పురా నాలాపనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరో మూడు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement