Wednesday, April 24, 2024

నెట్ ప్లిక్స్ లో అంటే సుంద‌రానికీ-నేటి నుండే స్ట్రీమింగ్

వివేక్ ఆత్రేయ తెర‌కెక్కించిన చిత్రం అంటే సుంద‌రానికీ. ఈ మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అయింది మ‌ల‌యాళ బ్యూటీ న‌జ్రీయా..హీరోగా నేచుర‌ల్ స్టార్ నాని నటించాడు. ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.. .ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ టైమ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఇవాళ్టి నుంచి ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మతాంతర వివాహం అనే టాపిక్ పైన ఈ సినిమా లో డైరెక్టర్ డిస్కస్ చేశారు. ఈ పిక్చర్ ద్వారా మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో సీనియర్ హీరో నరేశ్, రోహిణి, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement