Friday, February 16, 2024

HYD: ఆరోగ్య ప్రచారాన్ని ప్రవేశపెట్టిన ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్ అండ్ కంట్రీ డిలైట్

హైదరాబాద్ : పాఠశాలకు వెళ్లే పిల్లల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే లక్ష్యంతో, 8-5-1-0 (లేదా ఆరోగ్య సిద్ధాంతం లేదా ఆరోగ్య మంత్రం లేదా ఆరోగ్య సూత్రం) ఆరోగ్య నియమం ప్రవేశపెట్టబడింది. పిల్లలకు సరైన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను అందించే పద్దతులపై దృష్టి సారిస్తూ ఈ నియమాన్ని రూపొందించారు. ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్ కలిసి హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ చర్చ, సమావేశంలో 20 మందికి పైగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొని ఈ వినూత్న, ఆచరణాత్మక నియమం గురించి చర్చించారు.

ఈసందర్భంగా ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సీఈఓ అండ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ మాజీ సీఈఓ అయిన పవన్ అగర్వాల్ మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు సంరక్షకులుగా, మన భవిష్యత్తును రూపొందించడంలో పిల్లల ఆరోగ్యం కీలక పాత్రను తాము గ్రహించామన్నారు. అందుకే తాము వారి కోసం ఆరోగ్యం, క్షేమానికి సంబంధించిన 8-5-1-0 నియమాన్ని రూపొందించామన్నారు. ఈ ఆరోగ్య నియమాల్ని దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు పెద్ద ఎత్తున చేరవేయాలని, పాఠశాలలు ఈ ఆరోగ్యకరమైన ఫార్ములాలను అర్థం చేసుకోవడంలో, అవలంబించడంలో సహాయపడాలని కంట్రీ డిలైట్, ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ కోరుకుంటున్నాయన్నారు.

కంట్రీ డిలైట్ సహ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ చక్రధర్ మాట్లాడుతూ… భారతదేశం మరింత మెరుగ్గా జీవించడంలో సహాయం చేయడమే కంట్రీ డిలైట్ మిషన్ అన్నారు. పవన్ అగర్వాల్‌తో కలిసి పనిచేసి 8-5-1-0 నియమాన్ని ప్రవేశపెట్టడానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామన్నారు. తాము (కంట్రీ డిలైట్) 8-5-1-0 సూత్రాన్ని మనస్పూర్తిగా స్వీకరించామన్నారు. భారతదేశ భవిష్యత్తుకు మూలస్తంభాలైన నేటి బాలల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement