Sunday, May 19, 2024

Delhi | భువనేశ్వరితో టీడీపీ యువనేతల భేటీ.. ఢిల్లీలో కలిసిన అడారి కిషోర్ కుమార్


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నారా భువనేశ్వరితో తెలుగుదేశం యువనేత, మిషన్ కర్షక దేవోభవ జాతీయాధ్యక్షులు అడారి కిషోర్ కుమార్ సమావేశమయ్యారు. ప్రఖ్యాత న్యాయవాది సిద్దార్థ్ లూత్రా కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు సోమవారం నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారం వారు బస చేసిన ఒబెరాయ్ హోటల్‌లో భువనేశ్వరిని కలిసిన అడారి కిషోర్ కుమార్ నేతృత్వంలోని యువనేతల బృందం ‘డెమెక్రసీ ఇన్ డేంజర్’ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని, కక్షసాధింపు చర్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మండి పడ్డారు. ఈ తరుణంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమం అన్ని వర్గాలను ఆలోచింపజేస్తుందని అన్నారు. యువత చైతన్యం కోసం, రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న మంచి పనులను భువనేశ్వరి అభినందించారని సమావేశం అనంతరం అడారి కిషోర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

తెలుగుదేశం ఎంతో చరిత్రకలిగిన పార్టీ అని, అలాంటి పార్టీలో యువచైతన్యానికే పెద్ద పీట ఉంటుందనే విషయాన్ని భువనేశ్వరి చెప్పారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఇచ్చే ప్రోత్సాహం, సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ‘డెమెక్రసీ ఇన్ డేంజర్’ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని వర్గాల్లోనూ చైతన్యం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పారు. అనంతరం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకి వీడ్కోలు పలికారు. అంతకు ముందు మాజీ మంత్రి నారాయణను కూడా ఆడారి కిషోర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement