Sunday, October 6, 2024

HYD | నగరంలో భారీ పోలీసు బందోబస్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలు అత్యంత కీలకంగా మారాయి. శాంతి, భద్రతల పరిరక్షణతో పాటు ఎన్నికల విధుల నిర్వహణ కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య వెల్లడించారు.

45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3,000ల మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బంధి, 50 కంపెనీల స్పెషల్‌ పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు, చుట్టు పక్కల రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు బందోబస్తులో ఉన్నట్లు సీపీ వివరించారు. ఇందులో 5వేల మందిని కర్ణాటక నుంచి, మరో 5వేల మందిని మహారాష్ట్ర నుంచి, 2,500ల మందిని ఛత్తీస్‌గఢ్‌ నుంచి, 2వేల మందిని మధ్యప్రదేశ్‌ నుంచి, మరో రెండు వేల మంది హోంగార్డులను ఒడిశా నుంచి రప్పించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement