Tuesday, April 16, 2024

హైద‌రాబాద్ లో భారీగా ప‌ట్టుబ‌డిన‌ న‌కిలీ మ‌ద్యం..

మరోసారి భారీగా నకిలీ మద్యం బయటపడింది. హైద‌రాబాద్ నగర శివారు ప్రాంతాల్లో జోరుగా మద్యం విక్రయాలు సాగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ లో సుమారు రూ.2 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యాన్ని గుర్తించిన అధికారులు మద్యం వ్యాపారి బింగి బాలరాజు గౌడ్ కి చెందిన గోదాంగా గుర్తించారు. బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డి కలిసి నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 20 వైన్ షాపులకు నకిలీ మద్యం పంపిణీ అయినట్లు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement