Friday, December 6, 2024

ఎవ్వరు చెప్పినా రామ్ గోపాల్ వర్మ మారడు.. అంటోన్న తల్లి సూర్యవతి

తను ఇతరుల ఇష్టాలను గౌరవిస్తాడని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యవతి తెలిపారు. తన వరకు వస్తే తనను తాను మార్చుకోవడానికి ఇష్టపడడు. తను ఇంటికి రాగానే నేను కనిపించాలి.. లేకపోతే నచ్చదు.. నన్ను చూడగానే తన కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. తనకు మారాలని మనసులో ఉంటేనే మారుతాడు. లేకపోతే ఎవ్వరు చెప్పినా మారడు. రాము ఈ జన్మలో మారడు అంటూ ఆమె తెలిపింది.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సూర్యవతి.. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను ఆమె పంచుకుంది .

రాము ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి తన విషయంలో నా ఆలోచన ఒకలా ఉంటుంది.. తను ఎవరో నాకు తెలియకపోతే అప్పుడు నా ఆలోచనలు కూడా ఇంకోలా ఉంటాయి కదా అంటూ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు సూర్యావతి.ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవడం కోసం వర్మ చేసే కామెంట్లు , పనులు చూస్తే ఎవరికైనా అసహ్యం అనిపిస్తుంది. మన సమాజంలో కొందరు వర్మ చేసే పనుల వల్ల అతడి వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తూ ఫాలో అవుతున్నారు. ఏ విషయమైనా సరే వర్మ గురించి ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement