Wednesday, May 1, 2024

Election Time – మేయ‌ర్ విజ‌య‌లక్ష్మీకి కాంగ్రెస్ గ్యాలం – పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి…

హైద‌రాబాద్ – అసెంబ్లీలో ఎన్నిక‌ల‌లో హైద‌రాబాద్ లో ఖాతా తెర‌వ‌ని కాంగ్రెస్ లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌ని చూస్తున్న‌ది.. ఇప్ప‌టికే బిఆర్ఎస్ ఎమ్మెల్య దానం నాగేంద‌ర్ ను లాగేసి అత‌డిని సికింద్రాబాద్ లోక్ స‌భ బ‌రిలో నిలిపింది.. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీతో మంత‌నాలు ప్రారంబించింది.. కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ నేడు మేయ‌ర్ నివాసానికి వెళ్లారు.. ఈ సంద‌ర్బంగా . కాంగ్రెస్ లోకి రావాలని దీపదాస్ మున్షీ మేయ‌ర్ ను ఆహ్వానించారు. అయితే కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం చెబుతానని, రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని తేల్చి చెప్పారు..వారి అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని మున్షికి వివ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement