Wednesday, May 1, 2024

SMFG: ఒకే రోజు లక్షకు పైగా పశువులకు చికిత్స చేసిన ఎస్ఎంఎఫ్జీ ఇండియా క్రెడిట్

హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ఎన్బీఎఫ్సీ లలో ఒకటైన ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ కో. లిమిటెడ్ (గతంలో ఫులర్టన్ ఇండియా క్రెడిట్ కో. లిమిటెడ్), తమ 6వ పశు వికాస్ డే (పీవీడీ)ని నిర్వహించింది. దేశంలో ఒకే రోజు నిర్వహించిన అతిపెద్ద పశు సంరక్షణ శిబిరమిది. ఈ శిబిరాలను 14 రాష్ట్రాల్లోని 460కు పైగా ప్రదేశాల్లో ఏకకాలంలో నిర్వహించారు. 1 లక్షకు పైగా పశువులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించారు.

ఈసంద‌ర్భంగా ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ – చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ శంతను మిత్ర మాట్లాడుతూ… త‌మ‌ గ్రామీణ కస్టమర్ బేస్‌లో 90శాతం కంటే ఎక్కువ మంది మహిళలున్నారన్నారు. త‌మ కస్టమర్లలో చాలా మంది పశువులను కొనుగోలు చేయటం కోసం రుణాలు తీసుకుంటారన్నారు. పశుపోషణ వారికి పెద్ద ఆదాయ వనరు అన్నారు. త‌మ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు మార్పుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయన్నారు.

ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్వామినాథన్ సుబ్రమణియన్ మాట్లాడుతూ… ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్‌లో, గ్రామీణాభివృద్ధి పట్ల త‌మ నిబద్ధత, బలమైన సామాజిక కార్యక్రమాలను సాధించాలనే త‌మ లక్ష్యంలో తాము స్థిరంగా ఉంటున్నామన్నారు. ప్రముఖ క్రెడిట్ ప్రొవైడర్‌గా త‌మ కమ్యూనిటీ ఔట్‌రీచ్ యాక్టివిటీస్, ఇన్‌క్లూజివ్ ప్రోగ్రామ్‌లు, విభిన్నమైన వర్క్‌ఫోర్స్ ద్వారా ఈఎస్ జీ సోషల్ అంశాన్ని ఉపయోగించుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లోని పశువులు, వాటి యజమానుల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరాలను పరిష్కరించడానికి పశు వికాస్ దినోత్సవం ప్రత్యేకంగా రూపొందించబడిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement