Sunday, May 19, 2024

పెట్రోల్‌లో కల్తీ కామన్ అయ్యింది.. చర్యలు తీసుకోవాలంటున్న వినియోగదారులు..

మేడ్చల్‌, ప్రభన్యూస్‌ : నిబందనలకు నీళ్లొదుతూ ఇష్టం వచ్చిన రీతిలో అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలోని ఉప్పల్‌, కాప్రా, అల్వాల్‌, మల్కాజిగిరి పాటు బోడుప్పల్‌, ఫిర్జాజిగూడ, కీసర, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంక్‌ల్లో పెట్రోల్‌లో కల్తీ అవుతుందని మీటర్లలో తేడాలున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని పలువురు వాహన దారులు వాపోతున్నారు. జిల్లాలో హెచ్‌సీసీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌ పలు రకాల కంపేనీలకు చెందిన సుమారు 250కి పైచిలుకు పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి, వీటిలో అధిక శాతం పెట్రోల్‌ బంక్‌ల్లో కల్తీ మాయాజాలం నడుస్తోందని వాహన దారులు పేర్కొంటున్నారు.

తనిఖీలు నామ మాత్రమే…

పెట్రోల్‌ బంకుల్లో కోట్లలో ఆదాయం ఉన్నా సౌకర్యాలు సున్నా, తనిఖీలు లేక పోవడంతో పెట్రోల్‌ బంకుల్లో వసతులు, సౌకర్యాలు లేక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. తరుచు ఏదో ఒక చోట పెట్రోల్‌ తక్కువగాగా వచ్చిందని, కల్తి జరిగిందని పరిపాటిగా మారింది. పెట్రోల్‌ బంకుల్లో నిబంధనల అమలుపై సంబంధిత శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించు కోవడంలేదన్న విమర్శలు అనేకం వస్తున్నాయి. జిల్లాలోని పెట్రోల్‌ బంకుల్లో కనీసం నిర్ణీత వ్యవదికి ఒక సారీ కూడ నామాత్రంగా తరిఖీలు చేసిన పాపాన పోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి, సంబంధిత పెట్రోల్‌ బంకులను సీజ్‌ చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

మీటర్లో తేడా…

జిల్లాలోని పలు పెట్రోల్‌ బంకుల్లో కొలతల్లో తేడాలు వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నా పట్టించుకొనే నాదుడే కరువయ్యారని వాహన దారులు ఆరోపిస్తున్నారు. జిల్లా పరిధిలోని ఉప్పల్‌, మేడ్చల్‌, శామిర్‌పేట్‌, మల్కాజిగిరి కీసర ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంకుల్లో కొలుతల్లో తేడాలు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నప్పటికి అధికారులు పట్టించు కోవడం లేదని పలువురు వాహన దారులు ఆరోపిస్తున్నారు. కొన్ని పెట్రోల్‌ బంకుల్లో లీటర్‌ పెట్రోల్‌ పోయించుకుంటే 69 మిల్లి లీటర్ల పెట్రోల్‌ తక్కువగా వస్తుందని వాహన దారులు చెబుతున్నారు. మరికొన్ని పెట్రోల్‌ బంక్‌ల్లో బంకుల యజమానులు వైట్‌ పెట్రోల్‌, కొన్ని చోట్ల డిజిల్‌ కలిపి విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. అక్రమాలకు అలవాటు పడిన పెట్రోల్‌ బంక్‌ ఏజెన్సీలు కల్తీ దందాతో వినియోగదారులకు నష్టం కలిగిస్తున్నారు. ఒక వైపు కల్తీదందా, మరోవైపు కొలత ల్లో తక్కువ పోస్తూ మోసం చేస్తున్నారని పలువురు వాహన దారులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

కనీస సౌకర్యాలు కరువు…

జిల్లాలోని పెట్రోల్‌ బంక్‌ల్లో వినియోగదారులకు కనీస సౌకర్యాలు కన్పించడంలో బంకుల నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. బంకుల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిబంధనలున్నప్పటికి బంకుల యజమానులు వీటిని కల్పిస్తున్న దాఖలాలు లేవు. బంకుల్లో కనీసం గొంతు తడపుకునేందుకు గుక్కెడు మంచినీరు కనిపించడ లేదని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వినియోగదారుల నుంచి సర్వీస్‌ టాక్ష్‌, వ్యాట్‌ టాక్ష్‌ వివిద టాక్ష్‌ల రూపంలో పన్నులు వసూలు చేస్తున్నప్పటికి బంక్‌ల యజమానులు పట్టించుకోవడం లేదు. జిల్లాలోని పెట్రోల్‌ బంకుల్లో కనీసం వర్శాకాలంలో బురద మట్టితో బంక్‌లు దర్శన మిస్థాయి. పెట్రోల్‌ బంకుల్లో కనీసం వసతులు లేకున్నా దర్జాగా నిర్వహిస్తుండడం, అధికారులు పట్టంచుకోక పోవడం కొసమేరుపు. అంతే కాకుండా ప్రతీ పెట్రోల్‌ బంకుల్లో ఏయిర్‌ కాంప్రేషర్‌ తప్పని సరిగా ఉండాని నిబందలు ఉన్నప్పటికి వాటిని అమలు చేయడం లేదు. ఈ క్రమంలో పెట్రోల్‌ పోసుకొనే వాహనం దారుడు టైర్లలో గాలి చెకింగ్‌ చేయాల్సిన బాద్యత ఎజెన్సీలపై ఉంటుంది. కనీసం పెట్రోల్‌ బంకుల్లో గాలి యంత్రాలు లేక పోవడంతో వాహన దారులు ఆందోళన చెందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement