Sunday, May 5, 2024

హైదరాబాద్: పెద్ద అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరం శివారులోని పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట్‌లో ఉన్న స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో రసయనాలు నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి. దీంతో గోదాము నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలముకున్నాయి.

ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీగా శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మంటల ధాటికి గోదామ్‌లోకి ప్రవేశించే వీలు లేకపోవడంతో అధికారులు జేసీబీల సహాయంతో గోడలను కూల్చివేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement