Friday, April 26, 2024

లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్న అపోలో చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి

యంగ్‌ డాక్టర్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డికి ఈరోజు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. భారతదేశంలో ప్రైవేట్‌ రంగంలో ఆరోగ్య సంరక్షణకు మార్గదర్శకత్వం వహించిన డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డిని ఆధునిక భారతీయ ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా ఈ అవార్డు నిలపడంతో పాటు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన చేసిన అసమానమైన కృషిని గుర్తించింది. డాక్టర్‌ రెడ్డి ప్రయత్నాల ఫలితంగా, భారతదేశం నేడు క్లినికల్‌ ఫలితాలను అభివృద్ది చెందిన దేశాలతో సరిసమానంగా, కొన్ని సమయాల్లో ప్రపంచ ప్రమాణాల కంటే మెరుగ్గా అత్యంత అధునాతన ఆరోగ్య సంరక్షణను అందించేవాటిలో ఒకటిగా నిలిచింది.

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తమిళనాడు స్టేట్‌ బ్రాంచ్‌ (ఐఎమ్‌ఎ, టిఎన్‌ఎస్‌బి), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జూనియర్‌ డాక్టర్స్‌ నెట్‌వర్క్‌ (ఐఎమ్‌ఎ జెడిఎన్‌), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ నెట్‌వర్క్‌ తమిళనాడు (ఎఎమ్‌ఎ ఎమ్‌ఎస్‌ఎన్‌ టిఎన్‌) ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్‌ యంగ్‌ డాక్టర్స్‌ డే సందర్భంగా ఈ అవార్డును అందించారు. డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి నాణ్యమైన, అత్యాధునిక ఆరోగ్య సంరక్షణపై పాశ్చాత్య దేశాలతో సరిసమానంగా అత్యుత్తమమైన క్లినికల్‌ ఎక్సలెన్స్‌ను అందరికీ చవకగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తన నిరంతర దార్శనీకతకు గాను ఈ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వచ్చింది. అధునాతన వైద్య విధానాల కోసం రోగులు విదేశాలకు వెళ్లాల్సిన తరుణంలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడం డాక్టర్‌ రెడ్డి దూరదృష్టితో కూడిన దృక్పథం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement