Monday, May 6, 2024

రెచ్చిపోతున్న చైన్ స్నాచ‌ర్లు.. పోలీసుల స్పెషల్ డ్రైవ్..

హైదరాబాద్‌లోనే చైన్‌ స్నాచర్లు మకాం వేశారు. వెస్ట్‌జోన్‌లో చైన్ స్నాచర్ల కదలికలను పోలీసులు గుర్తించారు. దీంతో వెస్ట్‌జోన్‌లోని అన్ని పీఎస్‌ల పరిధిలో నాకాబందీ నిర్వహిస్తున్నారు. మంగళ్‌హాట్‌ పరిసరాల్లో స్నాచర్ల కోసం గాలింపు చేపట్టారు. స్నాచర్ల ఫొటోలతో పోలీసులు గాలిస్తున్నారు. వెస్ట్‌జోన్‌ పరిధిలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అదేవిదంగా ఆదివారం ఉదయం నుంచి ద్విచక్ర వాహనాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టారు. వరుస చైన్ స్నాచింగ్‎లు నేపథ్యంలో యూసఫ్‎గూడలో తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. పలువురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement