Wednesday, April 24, 2024

మెట్రో రైల్ లో రెచ్చిపోయిన.. యువ‌తి

మెట్రో రైలులో త‌న‌కు వ‌చ్చిన విద్య‌ల‌న్నింటినీ ప్ర‌ద‌ర్శించింది ఓ యువ‌తి.ఇంత‌టితో ఆగ‌లేదు.తాను చేసిన‌ విన్యాసాలను ఓ వీడియోగా తీయించి ‘అపర్ణ దేవయాల్‘ పేరుతో ఉన్న ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది ఆమె ఇన్ స్టా గ్రామ్ ఖాతా. మెట్రోలో ప్రయాణికులు కింద పడిపోకుండా పట్టుకునేందుకు ఆధారంగా ఉండే హ్యాండ్ రెయిలర్లను చేత్తో పట్టుకుని అటూ, ఇటూ ఉయ్యాల మాదిరి ఊగిపోయింది. మధ్యలో యోగసనాలు వేసింది. ఆ తర్వాత మెట్రోలో సీట్ పైకి ఎక్కి డ్యాన్స్ చేసింది. ఎవరైనా వస్తున్నారా అంటూ మధ్య మధ్యలో అటూ ఇటూ గమనించడం వీడియోలో చూడొచ్చు. మొత్తానికి మెట్రోను ఇల్లుగా మార్చుకున్న ఈ యువతి విషయంలో యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అపర్ణా ఇలాంటివి చేయకు. చూసిన వారు కూడా ఇలానే చేస్తారు. దయచేసి సానుకూలంగా అర్థం చేసుకో అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement