Wednesday, May 22, 2024

అంబేద్కర్ జయంతి.. మొక్కలు నాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మొక్కలు నాటుదామని ట్విట్టర్ లో గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని నాగోల్ నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం పూర్వ చైర్మన్, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. అంబేద్కర్ ప్రకృతిపై చూపిన శ్రద్ధ అద్భుతమని కొనియాడారు.

తన సందర్శనకు వచ్చే వారు మొక్కలు నాటి తర్వాతే తనను చూడాలని కోరుకున్న గొప్ప మహనీయుడన్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రజలకు, భావితరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటుతూ..తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మారుస్తూ.. కలియుగ అశోక చక్రవర్తి లాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారన్నారు. అదే స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంను గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరూ స్ఫూర్తి పొందాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement