Thursday, May 2, 2024

LAVA: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌… రూ.17,999లకే లావా వారి అగ్ని2

హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (ప్రభ న్యూస్‌) : ప్రముఖ భారతీయ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ అయిన లావా ఇంటర్నేషనల్‌ లి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తన పండుగ సీజన్‌ డీల్స్‌ ను అమెజాన్‌ పై ఆవిష్కరించింది. లావా వారి అగ్ని2 అమెజాన్‌ పై రూ.17,999లకు డిస్కౌంట్‌ చేయబడిన ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. అందరి కన్నా ముందున్న ఇది వేగవంతమైన గేమింగ్‌, యాప్‌ అనుభవం కోసం మీడియాటెక్స్ డైమెన్సిటి 7050 ప్రాసెసర్‌ ద్వారా ఆధారితమైన భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌. అగ్ని2 అతిపెద్ద, ఈ విభాగపు ఉత్తమ 120 హెచ్‌ జెడ్‌ 6.78-ఇంచ్‌ ఎఫ్‌హెచ్‌డి ప్లస్‌ కర్వ్డ్‌ అమోలెడ్‌ డిస్‌ ప్లే అందిస్తుంది. ఈ డిస్‌ ప్లే 1.07 బిలియన్‌ కలర్‌ డెప్త్‌ తో వస్తుంది. ఇది ఈ విభాగంలో నిజంగా భిన్నమైనది. హెచ్‌డిఆర్‌, హెచ్‌డిఆర్‌ 10, హెచ్‌డిఆర్‌ 10 ప్లస్‌, వైడ్‌వైన్‌ ఎల్‌1 కు మద్ధతు ఇస్తుంది.

అగ్ని2 సూపర్‌ 50 ఎంపి క్వాడ్‌ కెమెరాలో విభాగపు మొదటి 1.0 మైక్రాన్‌ (1 యూఎం) పిక్సెల్‌ సెన్సర్‌ ఉంటుంది. అగ్ని2 ఉత్తమమైన 256జిబి స్టోరేజ్‌, వర్చువల్‌ గా 16జిబి ర్యామ్‌ వరకు విస్తరించగలిగిన 8జిబి ర్యామ్‌ ఇస్తుంది. ఈ ఆఫర్‌ మరింత యాక్సెసిబుల్‌ అయ్యేందుకు, కంపెనీ సౌకర్యవంతమైన ముందస్తు-బుకింగ్‌ ఎంపికలను ప్రవేశపెడుతోంది. ఈ ఆఫర్‌ ముందస్తు బుక్‌ విండో సమయంలో అక్టోబరు 4 ఉదయం 12 గంటల నుండి ప్రారంభమైంది. వినియోగదారులు తమ అగ్ని2 స్మార్ట్‌ఫోన్లను అమెజాన్‌ పే ఉపయోగించి రూ.99 చెల్లించి ముందస్తు బుకింగ్‌ ద్వారా సురక్షితం చేసుకోవచ్చు. ముందుగా బుక్‌ చేసుకున్న యూనిట్స్‌ కోసం రిడెంప్షన్‌ విండో అక్టోబరు 6, మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11:45 వరకు మాత్రమే తెరచి ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement