Friday, April 19, 2024

నీటి భద్రతా కార్యక్రమాలను విస్తరిస్తున్న ఏబీ ఇన్ బెవ్ ఇండియా

ఏబీ ఇన్ బెవ్ ఇండియా తమ నీటి పరిరక్షణ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమాల ద్వారా 2025 నాటికి రెండు రెట్ల అధికంగా నీటి పరిరక్షణ మెరుగుపరచనుంది. ఈ విస్తరణ, తమ కార్యకలాపాల వ్యాప్తంగా నిలకడగా నీటి నిర్వహణ ప్రక్రియలను ప్రోత్సహించాలనే కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఏబీ ఇన్ బెవ్ ఇండియా, ఆగ్నేయాసియా అండ్ ఇండియా ప్రొక్యూర్ మెంట్, సస్టెయినబిలిటీ హెడ్ అశ్విన్‌ కక్ మాట్లాడుతూ… తమ వ్యాపారాలకు మాత్రమే కాదు కమ్యూనిటీలకు సైతం అత్యంత కీలకమైన వనరు నీరన్నారు.

తాము కార్యకలాపాలు నిర్వహిస్తోన్న చోట తమ వ్యాపారాల వ్యాప్తంగా నీటి పరిరక్షణకు తాము కృషి చేస్తూనే ఉంటుంటామన్నారు. తమ నీటి పొదుపు కార్యక్రమాలు, భారతదేశపు జాతీయ నీటి పరిరక్షణ లక్ష్యాలకు తోడ్పడటంతో పాటుగా సస్టెయినబల్‌ బిజినెస్‌ ప్రక్రియల్లో తమ నాయకత్వ స్థానం సైతం ప్రదర్శిస్తుందన్నారు. మన కమ్యూనిటీలు, సరఫరా చైన్‌ వ్యాప్తంగా పెరుగుతున్న నీటి సవాళ్లకు తగిన పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement