Friday, April 19, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీకి.. కేజీఎఫ్ ఆర్ట్ డైరెక్ట‌ర్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హీరో విజయ్ దేవ‌ర‌కొండ‌ ఓ సినిమా చేయబోతున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఈ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే… విజయ్ గౌతమ్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి కేజీఎప్ కేజీఎఫ్ 2 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన శివ కుమార్ ను తీసుకోబోతున్నారట. సినిమాలో యాక్షన్ ప్లస్ కొంచెం డార్క్ థీమ్ ఉండడంతోనే ఈయనను తీసుకున్నట్లు సమాచారం.తే ఈ సినిమా విజయ్ దేవరకొండకు 12వ చిత్రం కావడంతో దీని వీడీ12 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో విజయ్ గతంలో ఎప్పుడూ కనిపించని క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసి కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల నటించబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement