Wednesday, April 24, 2024

అల్ల‌రిన‌రేశ్ కొత్త చిత్రం

వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు అల్ల‌రి నరేశ్. ఉగాది సంద‌ర్భంగా ఆయ‌న త‌న కొత్త చిత్రానికి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ చిత్రాన్నిచిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. ఔట్‌ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానిక డెబ్యూ డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ షురూ కానుంది. నరేశ్‌ గతంలో కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేశాడు. అయితే ఈ సారి స్టోరీలో ఉన్న యూనిక్‌ పాయింట్‌ ఇంప్రెస్‌ చేయడంతో నరేశ్ ఈ సినిమాను ఒకే చేశాడని ఇన్‌సైడ్‌ టాక్‌. ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు అందిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య కెమెరామెన్.. కాగా చోటా కే ప్రసాద్‌ ఎడిటర్. అల్లరి నరేశ్‌ 61వ సినిమా (Naresh61)గా వస్తుంది. మిగ‌తా విష‌యాలు త‌ర్వ‌లోనే తెలియ‌జేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement