Saturday, April 13, 2024

HYD: రెట్రోస్పెక్టివ్ పన్ను డిమాండ్ల ఆచరణాత్మక పరిష్కారం ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…ధనేంద్ర కుమార్

హైదరాబాద్ : రెట్రోస్పెక్టివ్ పన్ను డిమాండ్ల ఆచరణాత్మక పరిష్కారం ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కాంపిటీషన్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా ఎల్ఎల్ పీ ఛైర్మన్ ధనేంద్ర కుమార్ అన్నారు. ఆయ‌న గతంలో భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్‌ల కోసం ప్రపంచ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కాంపిటీషన్ కమీషన్ అఫ్ ఇండియాకు మొదటి ఛైర్మన్ గా చేశారు. అక్టోబర్ 7, 2023న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశంలో, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు పన్ను డిమాండ్ నోటీసులు, రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ గురించి చాలా రాష్ట్రాలు చర్చను లేవనెత్తాయి. దీనిపై, ప్రభుత్వం ఇది రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ కాదని వెల్లడించింది. పైన పేర్కొన్న వివరణల ఆధారంగా పన్ను అధికారులు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు నోటీసులు పంపడం గమనార్హం.

రాజ్యసభలో రాతపూర్వక సమాధానం ప్రకారం, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ఎఫ్ వై23లో జీఎస్టీ కి సంబంధించి 71 షోకాజ్ నోటీసులు జారీ చేయబడ్డాయి, ఇందులో జీఎస్టీ బకాయిలు రూ.1.12 ట్రిలియన్లు ఉన్నాయి. రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ గురించి మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ఒక ప్రసిద్ధ ప్రకటనను గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఆయన మాట్లాడుతూ… రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ పరంగా, భారతదేశం అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే, 2011 చట్టం చాలా ప్రతికూలంగా ఉంది, అందువల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం ఆ దుస్సాహసానికి పాల్పడితే, దానికి అయ్యే ఖర్చు చాలా భారీగా ఉంటుందన్నారు. 2007లో వోడాఫోన్- హచిసన్ రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ కేసుతో పాటుగా 2014లో కెయిర్న్ ఎనర్జీ నుండి పన్ను అధికారులు 1.6 బిలియన్ల పన్నులను డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు రావటంతో రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ రివర్సల్ ద్వారా ఆ కేసులు పరిష్కరించబడినవి.

ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ విషయానికొస్తే, ఆగస్టు 2023 వరకు, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు తాము ప్లాట్‌ఫారమ్ రుసుముపై 18శాతం జీఎస్టీకి లోబడి ఉన్నాయని భావిస్తూ, గేమ్ అఫ్ స్కిల్ మరియు గేమ్స్ అఫ్ ఛాన్స్ నడుమ స్పష్టమైన వైవిధ్యం చూశాయి. దానితో పాటుగా అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండానే రిటర్న్‌లు దాఖలు చేస్తూనే ఉన్నామని వారు వాదిస్తున్నారు. ఆగస్ట్ 2023లో జరిగిన 50వ సమావేశంలో, జీఎస్టీ కౌన్సిల్ ఆన్‌లైన్ గేమింగ్ కోసం పందెం వేసేవారితో చేసే డిపాజిట్లపై 28శాతం జీఎస్టీని ప్రకటించింది, గుర్రపు పందెం, క్యాసినోలు మరియు లాటరీలతో సమానంగా ఆన్‌లైన్ గేమింగ్ ని తీసుకువచ్చింది. పరిశ్రమ, కొన్నిరాష్ట్రాలు పునఃపరిశీలించమని విజ్ఞప్తులు చేసినప్పటికీ, వినియోగదారుల సంభావ్య నష్టం తదితర కారణాలు చూపుతూ తమ నిర్ణయం వెల్లడించామంది. 2017 నుండి గేమింగ్ కంపెనీలు 28శాతం జీఎస్టీని చెల్లించాలని పన్ను అధికారులు నోటీసులు ఇస్తున్నారు. గేమింగ్ పరిశ్రమ వాదించినట్లుగా, ఈ సవరణ ఉనికిలో లేనప్పుడు, అదెలా సాధ్యం. ఒకవేళ ఇది ఇప్పటికే ఉండి ఉంటే, సవరణ ఎందుకు అవసరం ? కొత్త జీఎస్టీ చట్ట సవరణ కేవలం ఒక స్పష్టీకరణ మాత్రమే అని పన్ను అధికారులు నొక్కిచెప్పినప్పటికీ, పరిశ్రమకు ఇది రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ లక్షణాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

- Advertisement -

పన్ను నోటీసులలో చేర్చబడిన మొత్తం చాలా ఎక్కువ. అనేక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల విలువకు మించిన మొత్తాలనూ డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ వై23లో రూ.16,400 కోట్ల ఆదాయం ఉన్న పరిశ్రమను 2017 నుండి లెక్కగట్టి రూ. 1.12 ట్రిలియన్ చెల్లించాలని డిమాండ్ చేయడం ఎంత వరకూ సబబు ? దీనితో చాలామంది కొత్త వ్యాపార నమూనాలను రూపొందించడం లేదా విదేశాలకు మారడం వంటి వ్యూహాలపై పని చేస్తున్నారు. ఇటీవల, 2024 కోసం మధ్యంతర బడ్జెట్ తరువాత, రెవెన్యూ కార్యదర్శి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ప్రభుత్వం సుమారుగా ఎఫ్ వై 25 నాటికి ఆన్‌లైన్ గేమింగ్ రంగం నుండి జీఎస్టీలో రూ.140 బిలియన్లు లేదా 1.7 బిలియన్లు సమీకరించనున్నట్లు ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా, సీబీఐసీ, సీబీడీటీ చైర్మన్ వేర్వేరు ఇంటర్వ్యూలలో ఈ రంగం నుండి జీఎస్టీ వసూళ్లు ఆరు రెట్లు పెరిగి సగటున గత అక్టోబర్ నుండి నెలకు రూ.1200 కోట్లు జరిగాయని వెల్లడించారు. ఆన్‌లైన్ గేమింగ్ రంగం ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తుందని, మొత్తం ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహదపడుతుందని ఈ సంఖ్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి.


ఆసక్తికరంగా, 2021లో, వివాదాస్పద రెట్రోస్పెక్టివ్ పన్ను చట్టాన్ని రద్దు చేసేందుకు (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. ఈ తరహా బిల్లులు పన్ను ఖచ్చితత్వ సూత్రానికి విరుద్ధంగా ఉన్నాయని, ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారతదేశం ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అప్పుడు అంగీకరించారు. పన్నుల బకాయిల ప్రస్తుత సమస్యపై ప్రభుత్వం, జీఎస్టీ కౌన్సిల్ తమ విధానాన్ని పునఃపరిశీలించడం అత్యవసరం. చట్టబద్ధంగా సరైనది, ఆర్థికంగా ప్రయోజనకరమైన అంశాల మధ్య సమతుల్యత పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, సాంకేతికత, ఉపాధిని ప్రోత్సహిస్తుంది, దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది, ఇందులో భాగస్వాములందరికీ ప్రయోజనం చేకూర్చే మరింత సమతుల్య, ఆశాజనకమైన పన్ను విధానం అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement