Monday, April 15, 2024

WPL | ఆర్‌‌సీబీని ఆదుకున్న పెర్రీ.. ముంబై ముందు ఈజీ టార్గెట్ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌‌సీబీ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. దీంతో 132 పరుగుల టార్గెట్‌తో ముంబై జట్టు చేజింగ్‌కు దిగనుంది.

ఆదిలోనే కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ జ‌ట్టును ఎల్లీస్ పెర్రీ (44) తన అద్భుత ఇన్నింగ్స్ తో ఆదుకుంది. ఇక జార్జియా వేర్‌హామ్ (27) పరుగులతో పరువాలేదనిపించింది. ఇక మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ 20కి పైగా పరుగులు చేయలేకపోయారు. ఇక ముంబై బౌలర్లలో స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్ 2 వికెట్లు పడకొట్టగా.. ఇసాబెల్లె వాంగ్, సైకా ఇషాక్ చరో వికెట్ తీసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement