Friday, October 4, 2024

Polio 2024 | తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. రేపే పల్స్ పోలియో!

చిన్నారుల నిండు ప్రాణాన్ని కాపాడేందుకు ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పోలియో రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రేపు (ఆదివారం) దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మార్చి 3న ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారు. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో మొబైల్ బూత్‌లు కూడా ఉన్నాయి.

ఇప్పటికే పోలియో వ్యాక్సిన్ అందించడానికి శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులు విధిగా పోలియో బూత్‌కు వెళ్లి పోలియో చుక్కలు వేయించాలి. ప్రయాణంలో ఉన్న కూడా పోలియో చుక్కలు వేయించుకోవచ్చు. ప్రముఖ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా పోలియో కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 3న ఒక వేళ మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే మార్చి 4,5 తేదీల్లో గ్రామాల్లోని ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement