Saturday, May 4, 2024

జింకపై వేట కుక్కల దాడి.. జ‌గిత్యాల జిల్లాలో ఘ‌ట‌న‌

జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలలో జింకపై వేట కుక్కల దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో జింక తీవ్రంగా గాయ‌ప‌డింది. ఈ సమాచారాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు అందించారు. దీంతో గాయ‌ప‌డ్డ జింక‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించిన‌ట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement