Sunday, April 28, 2024

TS : నగరంలో భారీగా డ్రగ్స్ సీజ్.. నలుగురు అరెస్ట్

నగరంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ గట్టి నిఘా పెట్టింది. ఇందులో భాగంగా సిటీల్లోని ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ ఎస్‌వోటీ, పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు.

నగరంలో వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ముఠా, కస్టమర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు వారి నుంచి 1.5 కేజీల ఓపీఎం, 24 గ్రాముల హెరాయిన్, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్ పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నలుగురు డ్రగ్ పెడ్లర్స్, ముగ్గురు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement