Tuesday, May 28, 2024

Honor – సివిల్స్ టాపర్ అనన్యకు రేవంత్ స‌త్కారం

హైద‌రాబాద్ – యూపీఎస్సీ సివిల్స్ 2023 టాపర్ దోనూరి అనన్య రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు స‌త్క‌రించారు.. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన కుటంబ సభ్యులతోపాటు వెళ్లిన అనన్యను సిఎం అభినందించారు.. ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. తెలంగాణ కీర్తీని మ‌రింత పెంచారంటూ ప్ర‌శంసించారు.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు సివిల్స్ ఎన్నుకోవ‌డం, అందులో విజ‌యం సాధించ‌డం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంద‌న్నారు రేవంత్ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement