Wednesday, May 1, 2024

అధిక ఫీజులు నియంత్రించాలి.. కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జూనియర్‌ కళాశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. దీనికి నిరసగా అన్ని ఇంటర్‌ కార్పొరేట్‌ కాలేజీల ముందు ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా మంగళవారంనాడు జూనియర్‌ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నా, అనుమతి లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్నాగానీ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ ఏబీవీపీ తెలంగాణ శాఖ ఈమేరకు ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపింది.

విద్యా సంవత్సరం పూర్తయినా సర్టిఫికెట్స్‌ ఇవ్వకుండా అధిక ఫీజుల కోసం తీవ్ర వేదింపులకు గురి చేస్తుండడంతో పైచదువులకు వెళ్లే అవకాశం కోల్పోతున్నామన్న బాధతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురై ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కళాశాలలను, కాలేజీలకు అనుబంధంగా హాస్టల్స్‌ నిర్వహిస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈమేరకు ధర్నా, బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement