Sunday, May 5, 2024

Hurricane effect: తెలంగాణ‌లో ఇవాళ‌, రేపు భారీ వ‌ర్షాలు

ఇవాళ‌, రేపు తెలంగాణవ్యాప్తంగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ప‌డ‌నున్నాయి. ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీచేసింది. ఇవాళ‌ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ప‌డే అవ‌కాశాముంద‌ని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు వీయ‌నున్నాయి. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీల వేగంతో వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement