Thursday, May 2, 2024

Big Breking News: రావెల్లిలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో శిక్షణ విమానం కుప్పకూలింది. తూప్రాన్ పట్టణం పరిధిలోని రావెల్లి శివారులో ఇవాళ ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది.

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి శిక్షణ విమానం పూర్తిగా కాలిపోయింది. విమానప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పైలెట్​, ట్రైనీ పైలెట్​ సజీవదహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement