Tuesday, May 14, 2024

ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు – అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ శ్వేత పిలుపు

సిద్దిపేట ప్రతినిధి:- జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ శ్వేత కోరారు. పోలీస్ అధికారులు సిబ్బంది 24X7 అందుబాటులో ఉండేలా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వాగుల, చెరులు, నిండుకుండలా నిండి ప్రవహిస్తున్నాయి మరియు ప్రాజెక్టుల దగ్గరికి ఎవరు వెళ్ళవదనీ ప్రజలకు సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని, మరియు సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు
జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించేనా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, రోడ్స్ టాపర్స్ , తాడు మరే ఇతర పరికరాలు అడ్డంపెట్టి సంబంధిత గ్రామల సర్పంచులకు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల సర్పంచులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు సిబ్బంది హెడ్క్వార్టర్ వదిలి వెళ్లవద్దని తెలిపారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.

పట్టణాలలో గ్రామాలలో మట్టితో కట్టిన పురాతన ఇండ్ల గురించి సమాచారం తెలుసుకుని, ఇండ్లు కూలే ప్రమాదంలో ఉంటే సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారుల సహకారంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.
వరత ఉద్ధృతి ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు.
రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించి నందున ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప ఇండ్లలోనికి బయటకు రావద్దని సూచించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 నెంబర్లకు సమాచారం అందించినచొ సహాయక రక్షణ చర్యలు చేపడుతామని కమిషనర్ తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు సలహాలు పాటించి వాగులు మరియు రోడ్లు, బ్రిడ్జి పై నుండి వెళుతున్న నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. ఎవ్వరు కూడా పొంగుతున్న చెరువులు వాగులు బ్రిడ్జిల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగవద్దని సూచించారు. పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

సిద్దిపేట వరంగల్ వెళ్లే రోడ్డులో కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోయ తుమ్మెద వాగు బ్రిడ్జ్ పై నుండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు వాహనదారులు ఎవ్వరు వెళ్లకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా రెండు వైపులా స్టాపర్స్ పెట్టి పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు, ట్రాఫిక్ డైవర్షన్ చేశామ‌న్నారు క‌మిష‌న‌ర్.
సిద్దిపేట వైపు నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు బస్వాపూర్ గ్రామము నుండి కొరెడ్డిపల్లి లక్ష్మాపూర్ గ్రామాల మీదుగా వరంగల్ , వరంగల్ నుండి సిద్దిపేటకు వచ్చే వాహనదారులు లక్ష్మాపూర్ .కోరెడ్డిపల్లి, బస్వాపూర్ గ్రామాల మీదుగా సిద్దిపేటకు రావాల‌ని కమిషనర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement