Friday, May 3, 2024

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలే..

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement