Saturday, April 20, 2024

విశాఖలో పీవీ సింధు అకాడమీకి 2 ఎకరాల భూమి

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ జారీ చేసింది. విశాఖలో పీవీ సింధు అకాడమీకి భూమిని కేటాయించింది. విశాఖ రూరల్ మండలి చినగాదిలి వద్ద 2 ఎకరాల భూమిని పీవీ సింధుకు కేటాయిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ భూమి పశుసంవర్ధక శాఖకు చెందినది కాగా, పీవీ సింధుకు అందించేందుకు వీలుగా, దాన్ని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు బదలాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.

తనకు భూమిని కేటాయిస్తే బ్యాడ్మింటన్ కోచింగ్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ నెలకొల్పుతానని పీవీ సింధు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పీవీ సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ రంగంలో సాధించిన ఘనతలకు గుర్తింపుగా ఏపీ ప్రభుత్వం… విశాఖలోని చిన గాదిలి వద్ద స్థలాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ప్రతిభ కలిగిన పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement