Friday, May 17, 2024

ఇందల్ వాయి పెద్ద చెరువుకు వరద ఉదృతి…ప‌లు గ్రామాల‌కు రాకపోక‌లు బంద్ ….

ఇందల్ వాయి ఆగస్టు 4 ప్రభ న్యూస్ – ఆదివారం ఉదయం నుంచి నేడు కూడా ఏక‌దాటిగా కురుస్తున్నా భారీ వర్షాలకు నీరు భారీగా చెరువులకు చేరుకొని నిండు కుండల , అలుగులు పొంగి పొర్లతున్నాయి .. వరద ఉదృతి ఉండటం వల్ల సోమవారం ఉదయం ధార్పల్లీ వైపు వెళ్లే దారిలో రెండు వాగులు రోడ్డు మీద నుంచి భారీ ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ఒక దశలో వెంగల్పడ్ దగ్గర ఉన్న వాగు బ్రిడ్జి పై పెచ్చులు పూర్తిగా లేచి పోయాయని. ఏ క్షణమైనా బ్రిడ్జి తెగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భ‌య‌ప‌డ్డారు.

ఇందల్ వాయి పెద్ద చెరువు లో గంగమ్మ గుడి. శివాలయంలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. పదిహేను ఏళ్ల క్రితం ఇంత పెద్దా ఎత్తున నీరు చేరుకుందని, అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇదే తొలసారి అనీ సర్పంచ్ సతేవ్వ తెలిపారు. గన్నరము చిన్నావాగు సైతం ఉదృతంగా ప్రవహించడం తో గన్నరము నల్లవెల్లి. సిర్నపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ప్రజలు. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement