Sunday, April 28, 2024

NZB: నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం… ఫైర్ సిబ్బందికి గాయాలు

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 23(ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లాలోని బాలాజీ సానిటరీ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి నిజామా బాద్ నగరంలోని దేవీ రోడ్డులోని బాలాజీ శానిటరీ షాపులో నుంచి మంటలు రావడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా మంటలు అదుపులోకి రాకపోవడంతో మరికొన్ని ఫైర్ ఇంజన్లను తెప్పించి మంట లను ఆర్పివేశారు. కాగా మంటలను ఆర్పి వేసే క్రమంలో నిజామాబాద్ ఫైర్ స్టేషన్ ఇంఛార్జి నర్సింగ్ రావు, లీడింగ్ ఫైర్ మాన్ తిరుపతి, ఫైర్ మాన్ ఆశిష్ కుమార్​లకు గాయాలయ్యాయి. గాయాల పాలైన ఫైర్ సిబ్బంది నిజామాబాద్ నగరం లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో విచారణ చేపడు తున్నారు. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా దగ్ధం కాగా రూ.30 లక్షలు వరకు ఆస్థి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement