Monday, April 29, 2024

Health: కేన్సర్‌ బాధితులపై కొవిడ్‌ ఎఫెక్ట్‌.. టెస్టులు, ట్రీట్‌మెంట్ ఆల‌స్యంతో మరింత డేంజర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరోనా పరిస్థితులు కేన్సర్‌ రోగులను తీవ్రంగా ప్రభావితం చేశాయని డాక్టర్‌ సాయినాథ్‌ బేతనబొట్ల చెప్పారు. కేర్‌ ఆస్పత్రిలో సీనియర్‌ కన్సల్టెంట్‌గా ఉన్న సాయినాథ్ కేన్సర్‌ రోగులపై కొవిడ్‌ దుష్ఫలితాలను వివరించారు. ముఖ్యంగా రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న మహిళలు మహమ్మారి ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. తీవ్రమైన కేసులలో ఆలస్యంగా రోగ నిర్ధారణ జరగడం వల్ల ప్రాణాంతకంగానూ మారింద‌న్నారు.

కొవిడ్‌19 మహమ్మారి బారినపడతామేమో నన్న సంశయంతో చాలామంది రోగులు తమ చికిత్సా ప్రణాళికలను వాయిదా వేసుకోసుకున్నారు. అదీగాక వ్యాధి లక్షణాలు కనిపించే రోగుల చికిత్సకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడం, మహమ్మారి వల్ల తామెక్కడ ప్రభావిత మవుతాననే ఆందోళన కూడా చికిత్స పరంగా వారిపై ప్రభావం చూపింది. అందువల్ల, ఆరోగ్య సంరక్షణ డెలవరీ విధానం కూడా గణనీయంగా మారింది అని తెలిపారు. భారత దేశంలో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్‌ సంరక్షణ లేదా చికిత్స పరంగా తీవ్ర ప్రభావాన్ని మహమ్మారి చూపింది.

హాస్పి టల్‌లో డాక్టర్‌ను సంప్రదించడాన్ని, నిర్ధారణ పరీక్షలు, సాధారణ మామోగ్రామ్‌, పునర్నిర్మాణం, రేడియేషన్‌థెరఫీ, హార్మోనల్‌ థెరఫీ, మాస్టె క్టోమీ, కీమోథెరఫీ వంటి వాటిని రోగులు ఆలస్యం చేశారు. ఇది తీవ్ర ఆందోళనకర పరిణామం. రోగ నిర్ధారణ ఆలస్యం చేయడం కారణంగా అది మెటస్టాటి క్‌ దశ కు మారవచ్చు. మెటాస్టసైజ్డ్‌ దశలో క్యాన్సర్‌ ఊపిరితిత్తులకు విస్తరించడంతో పాటుగా అది ఊపిరితిత్తుల సమస్యగా పరిణ మించవచ్చు. ఒకవేళ రోగి కొవిడ్‌-19 బారిన పడితే పరిస్థితి మరింత దుర్భరంగా మారవచ్చు. అందువల్ల సరైన సమయంలో చికిత్స చేయడం అత్యంత ప్రాధాన్యతాంశం తద్వారా వ్యాధిని అడ్డుకోవడంతోపాటుగా మృత్యువాత పడకుండా అడ్డుకోవచ్చని డాక్టర్‌ సూచించారు.

ప్రస్తుతం, ఈ వ్యాధి బారిన పడిన మహిళలకు గతంతో పోలిస్తే ఎన్నో చికిత్సావకాశాలు ఉన్నాయి. అంతేకాదు, ఈవ్యాధి నయం చేయతగినది అందుబాటులోని చికిత్సావకాశా లలో రేడియేషన్‌థెరఫీ,శ స్త్ర చికిత్స లేదా రెండూ కలిపి చేయడం, కీమోథెరఫీని తరచుగా అదనపు, సహాయక మరియు నియోఅడ్డువాంట్‌ చికిత్సగా వినియోగించడం జరుగుతుందని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement