Tuesday, May 14, 2024

పాథాలజీ పరీక్షల అప్ గ్రేడేషన్ ను వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి, జూలై 30 (ప్రభ న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ 134 రకాల పాథాలజీ పరీక్షల అప్ గ్రేడేషన్ ను వర్చువల్ గా రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర హ్యాండ్లూం కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో పాథాలజీ పరీక్షల అప్ గ్రేడేషన్ పరికరాలను ప్రారంభించారు. పాథాలజీ పరీక్షల అప్ గ్రేడేషన్ రూపొందించిన పట్టికను ఆవిష్కరించారు. రోగులకు పరీక్షలు నిర్వహించిన పరీక్ష ఫలితాల నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ… స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న వైద్య సదుపాయాలు ఎక్కడా లేవన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ దేశానికే ఆదర్శం, హైదరాబాద్ ఆస్పత్రిలో అందే సేవలు మాలుమూల ప్రాంత ఆసుపత్రిలో అందించాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు.

134 పరీక్షలు ప్రారంభించడం ద్వారా పేదలకు ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం పెరుగుతుందన్నారు. ఖర్చులకు భయపడి పరీక్షలు వాయిదా వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని, పైసా ఖర్చు లేకుండా మారుమూల ప్రాంతాల ప్రజలకు 134 పరీక్షల సదుపాయం, దేశంలో ఎక్కడ లేని విధంగా 134 రకాల పాథాలజీ పరీక్షలకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వాణి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ అనిల్, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభూ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement