Sunday, June 16, 2024

TS : ఉద్యమకారులకు వందనాలు తెలిపిన హరీష్‌రావు

రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టమని మాజీమంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. మిలియన్ మార్చ్ రోజు సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్‌లో అమరులకు జోహార్లు తెలిపారు.

ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిందన్నారు. నిర్బందాలు..అరెస్ట్ లు..దిగ్బందాలను ఎదుర్కొంటూ మిలియన్ మార్చ్ లో పాల్గొన్న సందర్భం నేటికీ 13 ఏళ్ల అయినా ఇంకా కళ్ళముందు కదలాడుతూనే ఉందన్నారు. రాష్ట్ర సాధన కోసం ఆ నాడు తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి వందనాలన్నారు.అమరులకు జోహార్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement