Sunday, April 28, 2024

TS: రంజాన్‌ శుభాకాంక్షలు… మాజీ సిఎం కేసీఆర్…

ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు, తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయని వెల్లడించారు.

- Advertisement -

అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, నూతన రాష్ట్రాన్ని సర్వమతాల సమాహారంగా, గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా నెలకొల్పి, లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తమ పదేండ్ల పాలనలో నిలబెట్టామని పేర్కొన్నారు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నానని చెప్పుకొచ్చారు కేసీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement