Monday, April 29, 2024

సిద్దిపేట క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన హ‌నుమంత‌రావు

సిద్ధిపేట జిల్లా నూత‌న క‌లెక్ట‌ర్ గా ఎం.హ‌నుమంత‌రావు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈసంద‌ర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి. చెన్నయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది క‌లెక్ట‌ర్ కు పుష్ప గుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఆ త‌ర్వాత సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ హనుమంత రావు వర్గల్ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement