Monday, May 6, 2024

TS : గ్రూప్ 1 – 563 పోస్టులకు 4.03 లక్షల దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఈ నెల 14 వరకు అవకాశం ఇచ్చిన టీఎస్ పీఎస్సీ ఆ తర్వాత మరో రెండు రోజులు.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది.

- Advertisement -

ఈ పోస్టులు ఎక్కువగా ఉండటంతో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. శనివారం సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగిసింది. దీంతో మొత్తం 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష నిర్వహించే సమయంలో బయోమెట్రిక్ తీసుకోకపోగా, హైకోర్టు తీర్పుతో మరోసారి పరీక్షను రద్దు చేశారు. ఫలితంగా ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను రద్దు చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement