Sunday, April 28, 2024

Kamareddy: సభాపతికి ఆర్టీసీ కార్మికుల ఘన సన్మానం..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిన బాన్సువాడలో ఘనంగా సన్మానించారు. ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా సభాపతి మాట్లాడుతూ… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయమని, 43,000 మంది కార్మికులకు శుభ పరిణామం అని అన్నారు. కార్మికుల యాబై సంవత్సరాల కల నెరవేరిందన్నారు. మీరు ఇప్పుడు కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగులన్నారు. ఆర్టీసీ కార్మికులకు సభాపతి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయం తదుపరి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. త్వరలోనే ఇది చట్టంగా మారుతుందన్నారు.

సంస్థ ఉద్యోగులు ప్రయాణికులకు మెరుగైన సేవలను, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిపేరు తేవాలని కార్మికులకు సభాపతి సూచించారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాను, కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ని మించిన వారు ఎవరూ లేరన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినా ముఖ్యమంత్రిగా కేసీఆర్ సమర్ధవంతంగా నడిపిస్తున్నారన్నారు.ప్రతి పక్షాల్లో ముఖ్యమంత్రి పదవి కోసం తన్నుకోవడమే సరిపోతుందన్నారు. తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాల్లో ఎందుకు లేవని ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారన్నారు. తమకు కూడా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలనే నిర్ణయం ముఖ్యమంత్రిదే అన్నారు. పెరిగిన రాష్ట్ర ఆదాయాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు.


పక్కన ఉన్న కర్ణాటకలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు. తలసరి ఆధాయంలో దేశంలో నెంబర్ వన్ అన్నారు. 2014లో ఉన్న రూ.1.12 లక్షల నుండి ఇప్పుడు రూ.3.12 లక్షలకు పెరిగిందన్నారు. విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ గా ఉన్నాం. ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్. గత పదేళ్ళ నుండి రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. మణిపూర్, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు దేశానికి మంచిది కాదన్నారు. ఎల్లప్పుడూ మంచితనం ముఖ్యమన్నారు. గత ఐదేళ్ళలో బాన్సువాడ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు వచ్చాయన్నారు. నియోజకవర్గ ప్రజల తరుపున ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement