Friday, April 26, 2024

మ‌హిళా ఉద్యోగుల‌కి బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ చేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ని పుర‌స్క‌రించుకుని రాజ్ భ‌వ‌న్ లోని మ‌హిళా ఉద్యోగులు..సిబ్బందికి బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ చేశారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర‌రాజ‌న్. తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక మాత్రమే కాదు.. బతుకమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బతుకమ్మలో సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో, కుటుంబసభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాల‌న్నారు. తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement