Tuesday, April 30, 2024

రేపే సర్కారు వారి ఇఫ్తార్ విందు : మంత్రి తలసాని

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో రేపు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్న‌ట్లు రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరిశీలించారు. ఈసంద‌ర్భంగా మాట్లాడుతూ… పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీంలు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగల నిర్వహణ
జ‌రుగుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నామ‌న్నారు. ఇఫ్తార్ విందుకు వచ్చే ప్రతినిధులకు ప్రత్యేక పాస్ లను జారీ చేయడం జరిగిందన్నారు. రంజాన్ సందర్భంగా పేద ముస్లీంలకు ప్రభుత్వం తరపున దుస్తులను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ఈ ఇఫ్తార్ విందు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామ‌న్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాల ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement