Sunday, April 28, 2024

స్వర్ణకారుల ప్రత్యేక ఫెడరేషన్ కోసం ధర్నాచౌక్ లో నిరాహార దీక్ష

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ (ప్రభ న్యూస్) 4: స్వర్ణకారులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ప్రభు త్వం వెంటనే స్వర్ణకారుల సమ స్యలను పరిష్కరించాలని స్వర్ణ కార సంఘం రాష్ట్ర స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి చేపూరి వేంకులు స్వామి డిమాండ్ చేశారు. రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపులో భాగంగా సోమవారం నగర స్వర్గకార సంఘం నిజామాబాదే అధ్యక్షులు గుత్ప సదానం దాచారి అధ్యక్షతన సోమవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో స్వర్ణకారుల సమస్యల సాధనకై నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ కార్యక్ర మానికి రాష్ట్ర స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి చేపూరి వేంకులు స్వామి హాజరై మాట్లాడుతూ, .. చేతి వృత్తిని నమ్నుకునే వందల సంవత్సరా లుగా ఆత్మగౌరవముతో సాంప్ర దాయ బద్దంగా సమాజ మును గౌరవిస్తు జీవిస్తున్న విశ్వబ్ర హ్మణ స్వర్ణకారులమని అన్నారు. ఇటీవల కాలంలో వలసదారులు, పేట్టబడి వర్గం, దీనికి తోడు కార్పొరేట్ జ్యావెల్లరీలు ఇవి అన్ని నేడు స్వర్ణకారుని బతుకును చిద్రం చేస్తు వారి కుటుంబల ను రోడ్డున పడేస్తున్నాయని వాపో యారు. స్వర్ణకారుడుంటే ఒక గౌరవం ఒక నమ్మకం అని అన్నారు. సాంప్రదాయలను కాపాడీ నికార్సయినై విశ్వబ్ర హ్మణ స్వర్ణకారుడు నేడు అదే దోపిడికి గుర‌వుత‌న్నార‌న్నారు.. ఒకవైపు పని లేక అర్ధిక ఇబ్బందులలో ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నగర అధ్యక్షుడు గుత్ప సదానందాచారి మాట్లా డుతు స్వర్ణకారులు నేడు కడు,నిరుపేదలుగా మారు తున్నారన్నారు. సంప్ర‌దాయ‌ వృత్తిదా రులను కూడా కాపాడీ భాద్య త ప్రభుత్వానిదే అన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్వర్ణ కారుల సమ స్యలపై జిల్లా కలెక్టర్ కు , పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేస్తామని తెలి పారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోశాధికారి నగర చిరంజీవి, దేవేందర్, శ్రీనివాస్, సుధాకర్ స్వర్ణకార సంఘ నాయకులు స్వర్ణకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement