Wednesday, May 1, 2024

Gokul Das: గోకుల్ చాట్ యజమాని మృతి

హైదరాబాద్‌లో ‘గోకుల్ చాట్’ పేరు తెలియని వారు ఉండ‌రు. దాని యజమాని ముకుంద్ దాస్ నిన్న మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గోకుల్‌ చాట్‌ను ఆయన 1996లో ప్రారంభించారు. కోఠి సందర్శించిన వారు ఇక్కడ చాట్ తినకుండా వెళ్లలేరు. అంతగా ఫేమస్ అయిన ఈ గోకుల్ చాట్ పేరు 2007లో దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కారణం అక్కడ జరిగిన బాంబుదాడే. ఆ ఏడాది ఆగస్టు 25న ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. చాట్ తింటూ ముచ్చట్లాడుకుంటున్న 33 మంది ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో స్నేహితులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. తాజాగా, గోకుల్ చాట్ పేరు మరోమారు వార్తల్లోకి ఎక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement